ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉంచాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట లో ఆయన మంగళవారం సొసైటీ ద్వారా ఎరువుల విక్రయాలను పరిశీలించారు. పెద్ద శంకరంపేటకు 20 రోజుల తర్వాత యూరియా వస్తే రైతులు ఎలా పంటలు సాగు చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.