బిజెపి ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు ఆమోదిస్తున్నామని చెప్తూనే అసెంబ్లీ బయట బీసీ బిల్లు నుండి మైనార్టీలను తీసేస్తేనే బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడం బీజేపీ యొక్క ద్వంద నీతికి నిదర్శనం అని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి రిజర్వేషన్ పైన తలతిక్క మాటలతో బిజెపి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.