మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దసరా పండగ నాటికి కోర్టు ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో లా సెక్రెటరీ పాపిరెడ్డిని కోరారు. లా సెక్రెటరీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.