ఆరోగ్య పరిరక్షణ గురించి వీక్లీ పెరేడ్ నిర్వహిస్తున్నామని, విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ ప్రదర్శనని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని, సమయం దొరికిన