Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: నేరాల నియంత్రణకు అంబరావుగూడ, కొఠారిలో కార్డెన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 24ద్విచక్ర వాహనాలు సీజ్: వాంకిడి సీఐ సత్యనారాయణ

Asifabad, Komaram Bheem Asifabad | Aug 23, 2025
నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు వాంకిడి సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం కెరమెరి మండలం అంబరావుగూడ, కొఠారిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ధృవ పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గ్రామంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us