మహబూబాబాద్ జిల్లా లయన్స్ క్లబ్ లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, అంగన్వాడి టీచర్లకు శనివారం సాయంత్రం 4:00 లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవి రాథోడ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలను అంగన్వాడి కేంద్రాల వద్ద తప్పనిసరిగా నమోదు చేసి వారికి అవసరమైన పౌష్టిక ఆహారం అందించడం, హెచ్ఐవి సోకిన తల్లి నుండి బిడ్డకు ప్రసవ సమయంలో గానీ పాలు పట్టే సమయంలో హెచ్ఐవి రాకుండా పలు సూచనలు చేయడం జరుగుతుందన్నారు. ఆంటీ రిట్రో వైరల్ మందులు వాడడం వలన పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి రాకుండా కాపాడవచ్చు అని తెలిపారు.