బొంతపల్లి గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల 4వ,రోజు సందర్భంగా బొంతపల్లి గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూర్ణాహుతి హోమం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల అమ్మవారి నినాదాలతో మార్మోగింది.