-ఉమ్మడి కుటుంబ వ్యవస్థే వృద్ధులకు రక్షణ -న్యాయ సహాయం కోసం సేవా కేంద్రం ఏర్పాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి వారసులే తీసుకోవాలని జగిత్యాల జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. జగిత్యాల జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని శనివారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో సందర్శించి వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధుల న్యాయ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.ఈసందర్బంగా ప్రభుత్వ చట్టాలపై,వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.వృద్ధాశ్రమంలోని మౌలిక వసతులను పరిశీలించి సలహాలు అందించారు.