ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులను అభ్యాస సామర్థ్యాలను అడిగి తెలుసుకొని అనంతరం స్టోర్ రూమ్ ,ఆర్ ఓ ప్లాంట్ ను పరిశీలించారు.మధ్యహ్నం భోజనం లో వండిన ఆహారాన్ని రుచి చూసి మెనూ ప్రకారం భోజనం అందించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. సరకుల నాణ్యతను పరిశీలించి విద్యార్ధులతో ముచ్చటిస్తూ వంట రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.