అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం 6:20 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రూరల్ టిడిపి నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నిన్నటి రోజున కక్కలపల్లి వద్ద సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయంతం కావడం జరిగిందని ఇది చూసి ఓర్వలేక వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, అయితే ప్రజలను మభ్యపెట్టి సభలకు తరలించిన సంస్కృతి వైసీపీ నేతలకే బాగా తెలుసునని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శలు చేశారు.