కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యకర్తలు సోమవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు వేతనాలు తగ్గించాలని చూసే నిర్ణయాన్ని మానుకోవాలని,18వేల ఫిక్స్ డ్ నెల వేతనం ఆశాలకు చెల్లించాలని, లెప్రసి, పీఆర్సీ,టిబి,పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయం నుండి అనేక కార్యక్రమాలలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా అనేక విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు గత ఎన్నికల్లో ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామిమేరకు జీతాలు పెంచాల్సింది పోయి ఇప్పుడు ఇస్తున్న వేతనం తగ్గించాలని ప్రభుత్వం ఆలోచించడం అనైతికమని అన్నారు