తాడిపత్రి డిపోకు చెందిన 42 RTC బస్సులు నిలిచిపోయాయి. గుత్తి-తాడిపత్రి ప్రధాన రహదారిపై జక్కలచెరువు వద్ద డ్రైవర్ అనిల్ కుమార్, కండక్టర్ బాలచంద్రలపై జరిగిన దాడిని నిరసిస్తూ డ్రైవర్లు గ్యారేజ్ వద్ద బస్సులను నిలిపి నిరసనకు దిగారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగేంత వరకు నిరసన విరమించమని స్పష్టం చేశారు.