సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లోని గ్రోమోర్ తో పాటు పలు ఎరువుల దుకాణాలను గురువారం తహసిల్దార్ దయానందం ఎస్సై క్రాంతికుమార్ ఏవో బాలకృష్ణ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా కొరత లేకుండా చూడాలని దుకాణ యాజమాన్యులను ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.