అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం మంటపాల నుంచి వినాయక విగ్రహాలను ట్రాక్టర్ లలో ఉంచి గ్రామ శివారులోని కుంటలు, చెరువుల వద్దకు తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా చిన్నారులు డీజే వాయిద్యాల నడుమ డ్యాన్స్ చితక్కొట్టారు. గుత్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.