నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ప్రభుత్వ బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా, సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపాల్ కిరణ్ ను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో స్టడీ అవర్స్ కొనసాగుతుండగా, పాఠశాల విద్యార్థులకు మాత్రం స్టడీ అవర్సు జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.