కులమతాలకు అతీతంగా శాంతి, సౌబ్రాతృత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో పర్వదినాలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మరియు పీస్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఎ బి.శివన్నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.