కామారెడ్డికి చెందిన విభూతి రమేష్, దివ్యల పాప పల్లవి(4) ఆడుకుంటు బయటకు వెళ్ళిన పాప తప్పిపోయి వేరే వాళ్లకు దొరికి, పోలీసులు, సామాజిక మధ్యమాల సాయంతో తల్లి తండ్రుల చెంతకు చేరిందని టౌన్ సీఐ. నరహరి తెలిపారు. శనివారం సీఐ కథనం ప్రకారం గాంధీనగర్ కాలనీకి వెళ్లిన పాప మహమ్మద్ మోసిన్, భరత్ కుమార్ లకు కన్పిస్తే, వారు సీఐ.నరహరికి అప్పగించారు. ఆ పాప ఎవరో అని తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు చెక్ చేసి వాట్సాప్ గ్రూప్లో పాప పిక్ వేశారు. పాప తల్లిదండ్రుల తెలుసుకొని పోలీస్ స్టేషన్కు చేరుకొని పాపను తీసుకున్నారు.