చినగంజాం మండలంలోని ఎరువుల దుకాణాలలో రెవెన్యూ,పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన టాస్క్బఫోర్స్ బృందం శనివారం తనిఖీలు నిర్వహించింది.ఆయా దుకాణాలలో గల స్టాక్ నిల్వలను పరిశీలించింది.యూరియాకి ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది.వ్యవసాయ సీజన్లో ఎరువులకు ప్రత్యేకించి యూరియాకు కొరత లేకుండా చూడడానికే ఈ తనిఖీలు నిర్వహించామని తహసిల్దార్ ప్రభాకరరావు చెప్పారు.