పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం ఐదు గంటలకు డీఎస్సీ ఉపాధ్యాయులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు పట్టాభి రామయ్య మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో మేము 47 ప్రకారం 16 రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరించారు అక్షర క్రమంలో ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం పాత పెన్షన్ అమలుకై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మేము 57 ప్రకారం పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.