ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కలకలం రేగింది. ఈ ఘటన చిన్నకోడూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు ముష్మీర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ బంధువులు తన భూమిని తనకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళామన్నారు. తహసిల్దార్ సలీం తో మాట్లాడగా.. రిజిస్ట్రేషన్ ఆపడానికి మాకు ఎలాంటి అనుమతులు లేవని, మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చని తెలిపారు. మేము కబ్జాలో ఉండి మాకు సంబంధించిన రికార్డులు మా పెద్దమ్మల పేర్లపై ఉన్నాయన్నారు. పలుమార్లు గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడిన మ