మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం మధ్యాహ్నం 12:00 లకు ఆందోళన చేపట్టారు.. రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతులను యూరియా పట్ల మోడీ ప్రభుత్వం మొండివైకరిని ఖండిస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు.. రైతులకు సమయానికి యూరియా అందిచకపోవడం తో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.