ఎడపల్లి మండలంలో బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే క్రాసింగ్ దగ్గర సోమవారం భారీ ట్రాఫిక్ జాం అయింది. రైలులో ఉన్న ఒక ఆకతాయి దుశ్చర్య కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ వైపు నుండి బోధన్ వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఉన్న ఒక యువకుడు అత్యవసర చైను లాగడంతో రైలు పట్టాల పైనే ఆగిపోయింది. దీనిని గమనించిన లోకో పైలట్ రైలు కంపార్ట్మెంట్ లోకి వచ్చేసరికి సాధన యువకుడు రైలు నుండి దూకి పారిపోయాడు. చైను లాగడంతో లోకో పైలట్ దానిని సరిచేసి ముందస్తు అనుమతి తీసుకుని ముందుకు పోవడంతో అరగంట పాటు ఈ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది