ఎస్ కోట మండలం రేవళ్ల పాలెం గ్రామంలో గడ్డి మందు తాగి ఆత్మహత్నానికి పాల్పడిన వివాహిత జాగరపు సుస్మిత మృతి చెందినట్లు ఆదివారం మధ్యాహ్నం పోలీసులు తెలిపారు. వివాహిత సుస్మిత శనివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా అపస్మారక స్థితికిచేరిన ఆమెను కుటుంబీకులు విజయనగరం సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా ఆసుపత్రి వర్గాలు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కురిపేర్ చేశాయి. అక్కడ చికిత్స పొందుతూ వివాహిత సుస్మిత శనివారం రాత్రి మృతి చెందిందని, ఆదివారం ఆస్పత్రి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.