Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు జెన్కో సిఎస్ఆర్ నిధులు 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మోడల్ అంగన్వాడి కేంద్ర భవనాలకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది ఇబ్బందులను గుర్తించి బుద్ధారం గ్రామంలో 80 లక్షల రూపాయలతో నూతన భవనం నిర్మించమున్నట్లు, త్వరలో భవనం పూర్తయి అందుబాటులోకి వస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.