అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రం తో పాటు ఉరవకొండ పట్టణ పరిసరాల్లోని నీటి కుంటలు, వర్షపు నీరు నిలువ ఉన్న మురికి గుంతల్లో దోమల ఉదృత్తిని అరికట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా గంబుషియా చేప పిల్లలను శుక్రవారం వదిలారు. అనంతపురం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు 30 వేల గంబుషియా చేప పిల్లలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి ఆదేశాల మేరకు ఉరవకొండ ఎంపీడీవో రవి ప్రసాద్, మలేరియా సబ్ యూనిట్ అధికారి కోదండరామిరెడ్డి అధికారులతో కలిసి పట్టణంలోని నీరు ఉన్న ప్రాంతాల్లో గంబుషియా చేప పిల్లలను వదిలారు.