రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావు పల్లి గ్రామంలో BNS సెక్షన్ 163 వర్తింప చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు పోలీస్ అధికారుల సూచన ప్రకారం BNS 163 (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.