ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలని గుర్ల ఎస్ ఐ బాస్కర్ రావు కోరారు. జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ ఆదేశాలు మేరకు గుర్ల మండలం చింతలపేట. గుర్ల. కెల్ల. పాలవలస గ్రామంలో RPSF పోలీసులతో గురువారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో తిరిగి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.