రైతులు యూరియా కోసం క్యూల్లో నిలబడితే వారికి బఫే ఏర్పాటు చేయాలా అంటూ వ్యవసాయశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు రైతులను అవమానించడమేనని వైఎస్ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, రాజాంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.జిల్లా వైఎస్ఆర్‌సిపి కార్యాలయంలో ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు – రైతన్నకు బాసటగా అనే పోస్టర్‌ను అమర్నాథ్ రెడ్డి, జిల్లా పరిశీలకులు సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాష, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఆరం రెడ్డి, కౌన్సిలర్లు, వీరబల్లి, సుండుపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.