Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: మెడికల్ కళాశాలలో జూనియర్ MBBS విద్యార్థి పై, ర్యాగింగ్కు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి: PDSU జిల్లా కార్యదర్శి గణేష్

Nizamabad South, Nizamabad | Aug 25, 2025
నిజామాబాద్ లో జూనియర్ మేడికో విద్యార్థి పై సీనియర్ మెడికో విద్యార్థి దాడి, ర్యాగింగ్ చేయడాన్నీ వ్యతిరేకిస్తూ, PDSU ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, డాక్టర్ వృత్తి అనేది సమాజంలో ఎంతో గౌరవప్రదమైనదని అటువంటి వృత్తిని నేర్చుకునే మేడికో విద్యార్థులు ఈ విధంగా తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ర్యాగింగ్ చేయడం, దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గమన్నారు. తోటి విద్యార్థి పై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడినగానీ కళాశాల ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us