రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలని నాగారం మండల వ్యవసాయ అధికారి కృష్ణకాంత్ మండల ఎస్సై ఐలయ్య సూచించారు. గురువారం నాగారం మండల పరిధిలోని ఎరువుల విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ మరియు రికార్డును పరిశీలించారు వర్షాకాలం సీజన్‌లో రైతులకు కావాల్సిన అన్ని రకాల మందులు, ఎరువులు ప్రభుత్వం సరఫరా చేస్తుందని, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించకూడదని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించడంతో రైతులు చాలా నష్టపోతారని, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు.