వెంకటగిరి పట్టణంలోని జ్యోతి మహల్ పక్కన ఉన్న సర్వే నెంబర్ 227/ 10లో 48 సెంట్లు భూమి గత కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్నట్లు గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గతంలో మున్సిపల్, రెవెన్యూ శాఖలు ప్రభుత్వ భూమిగా గుర్తించి హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొందరి మధ్య వివాదం కారణంగా కోర్టుకు చేరిన ఆ సమస్య ఎట్టకేలకు భూ యజమానికే చెందిందని ఆర్డీవో కిరణ్ కుమార్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్డీవో ఆదివారం వెల్లడించారు.