పెండింగ్లో ఉన్న తమ క్లెయిమ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, సూర్యాపేట జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు కోదాడలోని లేబర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలోని 12 మండలాల నుంచి వచ్చిన సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాల సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు సీఐటీయూ జెండాలు, ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అధికారులు స్పందించి తమ క్లెయిమ్లను వెంటనే క్లియర్ చేయాలని కోరారు.