పొరుగు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో దేవరాపల్లి మండలం కాశీపాలెం గ్రామానికి చెందిన డెక్క నవీన్ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం. నవీన్ రాంబిల్లి మండలం చిన్నపూడి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమార్తెతో పదో తరగతి, ఇంటర్ నుంచి అతడికి స్నేహం ఏర్పడింది. వీరి సాన్నిహిత్యం గురించి తెలిసి యువతిని చెన్నైలో చదివిస్తున్నారని, అయినా వీరి మధ్య పరిచయం కొనసాగిందని, అమ్మాయి తరపు వారికి ఇష్టం లేకపోవడంతో నవీన్ని పథకం ప్రకారం హత్య చేశారు.