కోడుమూరు కోట్ల సర్కిల్లో సోమవారం ఉదయం సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఉల్లిగడ్డలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మార్కెట్లో ఉల్లి రైతులను దారుణంగా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పంట పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఉల్లికి రూ. 3 వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.