నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని ఒకటో నెంబర్ వినాయకుని వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వేదికపై తమను ఎందుకు కూర్చోనివ్వరని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో కాంగ్రెస్, బిజెపి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పిఎస్ కు తరలించారు.