భీమవరంలో జిల్లా రవాణా అధికారి కె ఎస్ ఎం వి కృష్ణారావు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అని బ్రేక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. శనివారం సాయంకాలం 6 గంటలకు గరగపర్రు రోడ్డులో ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడ్, లైసెన్స్, సరైన పత్రాలు లేకుండా వెళ్తున్న వారిని కారు నడుపుతూ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించి సుమారు 45 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ తేజ, సుబ్బలక్ష్మి, నరేంద్ర పలువురు అధికారులు పాల్గొన్నారు.