పలమనేరు: ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ జాతీయ అధ్యక్షుడు మాదేశ్ మాట్లాడుతూ, చత్తీస్గఢ్ కు చెందిన భార్యాభర్త అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమారుడిని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది, పరీక్షించిన వైద్యులు సమస్య గురించి అడగగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో విషయం తెలుసుకుని ఘటన ప్రాంతాన్ని చేరుకొని మేము విచారించిన అదే మాదిరి సమాధానమిచ్చారు. ఒకటిన్నర ఏళ్ల బాలుడి ఒంటిపైన మర్మంగాలపైన పంటిగాట్లు ఉండడం తీవ్ర ఆవేదన కలిగించే విషయం. ఈ విషయం పైన పోలీసులు దర్యాప్తు చేయాలి బాబు తల్లిదండ్రులపై సైతం కేసు కట్టడానికి కూడా వెనుకాడబోమన్నారు.