ప్రముఖ పుణ్య క్షేత్రం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. శ్రీనివాస్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం 11గంటల సమయంలో జస్టిస్ శ్రీనివాస్ ఆలయానికి రాగా ఆలయ అధికారులు, ఆలయ పండితులు, అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు.