ఎమ్మెల్యే మదన్మోహన్ ఆశీర్వాదంతో కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి గణేష్ మండపానికి ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మదన్మోహన్ చేతులమీదుగా ఎల్లారెడ్డి పట్టణ పరిసర గ్రామాల గణేష్ మండపాలకు ఉచిత లడ్డు వితరణ పంపిణీ పోస్టర్ ను నేడు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ..మండలంలోని ప్రతి గణేష్ మండపానికి ఉచిత లడ్డు పంపిణీ లాంటి వినూత్న ఆలోచనలు చేస్తూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న కురుమ సాయిబాబాను అభినందించడం జరిగింది ,మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నాయకులందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.