అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం నృసింహస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం వైభవంగా పల్లకి సేవ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు దేవాదాయశాఖ వారు కలసి నిర్వహించారు. పల్లకి సేవ మహోత్సవంలో భాగంగా స్వామి వారికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు పూజలనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పల్లకి సేవను భక్తులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో తిరుమలరెడ్డి ఆలయ సిబ్బంది పాల్గొన్.