అనకాపల్లి జిల్లా టిడిపి కమిటీ కూర్పునకు సంబంధించి ఆదివారం జరిగిన సమావేశానికి పరిశీలకుని హోదాలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా కమిటీ లోని మరో సభ్యురాలయిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తో కలిసి ఆయన జిల్లా కమిటీ పై పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు.పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్న నాయకులు,సీనియర్ కార్యకర్తలకు తప్పనిసరిగా జిల్లా కమిటీలో స్థానం ఇస్తామన్నారు.