శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ నుంచి పుట్టపర్తికి వెళ్లే రహదారిలో గట్లు వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఉదయం కుటాలపల్లి తండాకు చెందిన 10 మంది కూలీలు పని కోసం ఆటోలో పుట్టపర్తికి వెళ్తుండగా గట్లు వద్ద ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ముత్యాలమ్మ అనే మహిళ అక్కడికక్కడ దుర్మరణం చెందింది. మంగమ్మ అనే మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మిగిలిన 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి.వాహనదారులు ప్రమాద ఘటనను గుర్తించి గాయపడిన వారిని నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.