గంగవరం: మండల వాహనదారులు తెలిపిన సమాచారం మేరకు. ఫ్లైఓవర్ ముందు మదనపల్లి వైపు వెళ్లే రహదారిలో రెండు అడుగుల మేర పెద్ద గుంత ఒకటి ఏర్పడింది. ఇటుగా ప్రయాణించే వాహనదారులు రాత్రిపూట గమనించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. పగటిపూట పెద్ద వాహనదారులు సైతం అందులో దిగి అటు ఇటు కదలక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు కొంతమంది గాయాలు పాలవుతున్నారు. సంబంధించిన అధికారులు సాధ్యమైనంత త్వరగా ఆ గుంతను పూడ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా స్థానిక వాహనదారులు ప్రజలు కోరారు.