ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షం నీటిని ఎప్పటికప్పుడు బెయిల్ అవుట్ చేయడానికి మోటార్లను సిద్ధం చేసుకోవాలని, 3 వంతెనలు, కంకరగుంట ఆర్యూబీ దగ్గర నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం సమస్యలుంటే జీఎంసీ కాల్ సెంటర్ 08632345103 ఫోన్ చేయాలని చెప్పారు.