నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నీటి ట్యాంకు వద్ద మోటారు చెడిపోవడమే దీనికి కారణం. రోజుకు వెయ్యి మందికి పైగా రోగులు, సుమారు 400 మంది ఇన్ పేషెంట్లు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కాలకృత్యాలు, స్నానాల కోసం రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరా పునరుద్ధరణ చేయాలని పేషెంట్లు కోరుతున్నారు