ప్రభుత్వ అసమర్థత కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం సహకరించకపోయినా, ముందుచూపుతో కేసీఆర్ యూరియాను నిల్వ ఉంచారని చెప్పారు. యూరియా అందుబాటులో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటని ఆయన అన్నారు. రైతులు సినిమా టాకీస్ లా క్యూలైన్లలో నిలబెట్టడం సరికాదని విమర్శించారు.