అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం పాత బస్టాండ్ ప్రాంతంలో కూలిపోయిన పాత భవనం పక్కనే ఉన్న చెప్పులు దుకాణం మీద పడిపోయింది. రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న ఫుట్వేర్ షాప్ మొత్తం ధ్వంసం అయింది. షాపు యజమాని పైల అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం రూ. 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రమాదం సమయంలో ప్రాణనష్టం జరిగి జరగలేదన్నారు. ప్రభుత్వం ,అధికారులు తమను ఆదుకోవాలని కోరారు.