జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని వివిధ మండల గ్రామాల్లో ప్రతిష్ఠించిన గణనాథుల నిమజ్జనం, శోభయాత్రను గురించి జిల్లా ఎస్పీ నిబంధనలు విధించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వినాయక చవితి చివరి ఘట్టమైన గణేష్ నిమజ్జన శోభయాత్ర రాత్రి 10 గంటల వరకు పూర్తి చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.