మడకశిర మండలంలోని మాలే రోప్పం గ్రామంలో శుక్రవారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పాత నేరస్తులు రౌడీ షీటర్ల ఇల్లా పరిసరాల్లోనూ గడ్డివాముల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం గ్రామస్తులతో సిఐ నగేష్ బాబు మాట్లాడుతూ గ్రామంలో శాంతియుతంగా జీవించాలని శాంతిభద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.