కర్నాటక రాష్ట్రం దావణగేరెకు చెందిన శివ అనే వ్యక్తి రాయదుర్గం లోని తన మిత్రులను చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిత్రులతో సరదాగా గడిపిన శివ రాత్రి పట్టణంలో బళ్ళారి రోడ్డులో నడుస్తూ వెళుతుండగా బైక్ డీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.